ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌ద్ద నాలుగు బంగారు ఉంగ‌రాలున్నాయి. తాజా డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం ఆయ‌న త‌న ఆస్తులను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ఆయ‌న ద‌గ్గర రూ.3 కోట్ల 7 ల‌క్ష‌ల ఆస్తి ఉంది. గ‌తేడాది రూ.2.85 కోట్లు ఉన్న ఆయ‌న ఆస్తి క‌రోనా స‌మ‌యంలో కూడా రూ.22 లక్ష‌లు పెరిగి రూ.3కోట్ల 7 ల‌క్ష‌ల‌కు చేరింది. ప్ర‌ధాన‌మంత్రిగా ప‌నిచేసిన అట‌ల్‌బిహారీ వాజ్‌పేయి స‌మ‌యం నుంచి అంద‌రూ త‌మ ఆస్తుల‌ను బ‌హిర్గ‌తం చేస్తూ వస్తున్నారు. ఈ విధానాన్ని 2004లో వాజ్‌పేయి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. అప్ప‌టి నుంచి వివిధ హోదాల్లో ఉన్న రాజ‌కీయ నేత‌లు త‌మ ఆస్తుల‌ను, అప్పుల‌ను వెల్ల‌డిస్తూ వస్తున్నారు. లోక్‌పాల్‌, లోకాయుక్త 2013 చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌భుత్వ ఉద్యోగులంతా త‌మ త‌మ వార్షికాదాయ‌న్ని వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసే స‌మ‌యంలో కూడా నేత‌లు త‌మ ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంటారు. న‌రేంద్ర‌మోడీకి ఎటువంటి లోన్లు లేవు. అలాగే అప్పులు లేవు. ఆయ‌న ఒక ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వ్య‌క్తి అని, అలాగే ఒంటరి వ్య‌క్తికావ‌డంతో ఆదాయార్జ‌న‌పై దృష్టిపెట్ట‌లేద‌ని, ఉన్న ఆదాయాన్ని కూడా పొదుపుగా వాడుతుంటార‌ని మోడీ స‌న్నిహితులు, బంధువులు తెలియ‌జేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: