శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ల‌వ్‌స్టోరీ తాజాగా విడుద‌లై విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. క‌రోనా త‌ర్వాత పెద్ద‌సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ధియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌శ‌సంల వ‌ర్షం కురిపించారు. నాగ‌చైత‌న్య త‌న‌లోని న‌టుణ్ని పూర్తిగా ఆవిష్క‌రించారంటూ కొనియాడారు. సినిమా అద్భుతంగా ఉండ‌టంతోపాటు చిత్ర‌బృందం ప‌డిన క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భిస్తోందంటూ అభివ‌నంద‌న‌ల వర్షం కురిపించారు. నాగ‌ప‌ల్ల‌వి నృత్యం చూస్తే అది ఒక క‌ల‌లా అనిపించింద‌ని, ఆన్ స్క్రీన్‌పై ఇటువంటి నృత్యం ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేద‌ని, ఆమె న‌ట‌న కూడా ఎప్ప‌టిలాగానే అద‌ర‌గొట్టేసిందంటూ కొనియాడారు. అస‌లు ఎముక‌లు ఉన్నాయా?  లేవా? అనిపించింద‌న్నారు. ప్ర‌స్తుతం స‌మాజంలో మ‌నం చూస్తున్న ఎన్నో విష‌యాల‌ను సున్నితంగా చెబుతూ శేఖ‌ర్ క‌మ్ముల అద్భుతంగా తెర‌కెక్కించార‌న్నారు. సినిమాకు ప‌వ‌న్ అందించిన సంగీతం ఒక సంచ‌ల‌నంగా నిలిచిపోతుంద‌న్నారు. రెహ‌మాన్ శిష్యుడైన ప‌వ‌న్ అందుకు త‌గ్గ‌ట్లుగానే సంగీతం అందించార‌ని, రెహ‌మాన్ సార్‌.. మీ పేరు నిల‌బెట్టారు సార్ అంటూ ప్ర‌శంసించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర్ ప‌రిస్థితుల్లో సినిమాను ధియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేసిన నిర్మాత‌ల‌ను మ‌హేష్‌బాబు అభినందించారు.మరింత సమాచారం తెలుసుకోండి: