హీరో నానీ న‌టించి, సూప‌ర్ హిట్ కొట్టిన జెర్సీ సినిమా బాలీవుడ్ లోనూ అల‌రించ‌నుంది. అవార్డులూ రివార్డులూ సంపాదించిన ఈ సినిమా జాతీయ స్థాయిలోనూ మంచి పేరు తెచ్చుకుంది. క‌మ‌ర్షియ‌ల్ గానూ క్లిక్ అయింది. ఈ సినిమాతో నాని మంచి స‌క్సెస్ గ్రాఫ్ అందుకుని, కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో  ముందుండి మిగ‌తావారికి ఆద‌ర్శం అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లోకి తీసుకుపోయేందుకు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడీ సినిమాను షాహిద్ క‌పూర్ చేస్తున్నాడు. ఒక‌నాటి క్రికెట‌ర్ జీవితంలో జ‌రిగిన ప్రేమ, మిగ‌తా కుటుంబ త‌గాదాలు, భార్య‌తో విభేదాలు ఇవ‌న్నీ ప్ర‌ధానంగా
ఈ  సినిమా రూపొందింది. నానీ పెర్ఫార్మెన్స్ లానే షాహిద్ కూడా అల‌రిస్తాడ‌ని బీ టౌన్ అనుకుంటోంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 31న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది అని షాహిద్ త‌న ఇన్ స్టా అకౌంట్ లో పోస్టు చేసి, సినిమాకు సంబంధించిన స్టిల్ ఒక‌టి ఉంచి, అభిమా నుల‌ను అల‌రించాడు. ఈ సినిమాను సూర్యదేవ‌ర నాగ‌వంశి, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రో ఇద్ద‌రు కూడా స‌హ‌నిర్మాత‌లుగా ఉన్నారు. వారు దిల్ రాజు, అమ‌న్ గిల్ అని చిత్ర వర్గాలు చెబుతున్న మాట. సాచెత్ - ప‌రంప‌ర ద్వ‌యం సంగీతం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: