జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం చేసిన విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ మంత్రుల ను టార్గెట్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దీంతో మంత్రి పేర్ని నాని అలాగే అవంతి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందరూ కూడా ఘాటుగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 12 తారీకు నుంచి పవన్ కళ్యాణ్  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారని దీనికి సంబంధించి జనసేన పార్టీ అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారని మరోసారి చర్చలు జరిపిన తర్వాత పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap