ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి స్పష్టత రావడం లేదు. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అని భావించిన స్వల్ప అస్వస్థత తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల అమిత్ షా ఖాళీగా లేకపోవడంతో జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని తెలిసింది.

వచ్చే నెల రెండో తారీఖున సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత  రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి నేడు సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap