త్వరలో ఏపీ బీజేపీ నేతలు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి దీక్షకు దిగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయిస్తే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా పోరాటం చేసే ప్రయత్నం చేయడం లేదు.

త్వరలో పవన్ కళ్యాణ్ దీక్ష దిగుతారని నాదెండ్ల మనోహర్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ నిర్ణయానికి సంబంధించి బీజేపీ పెద్దలను సంప్రదించే అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సహా అన్ని పార్టీలు పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. మరి ఢిల్లీ పర్యటన తర్వాత ఏ మార్పులు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp