తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంక‌ట్ క‌న్నుమూశారు. ఆర్‌. ఆర్‌.మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆయ‌న ప‌లు సినిమాల‌ను నిర్మించారు. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప‌త్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఈరోజు ఉద‌యం క‌న్నుమూసిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆయ‌న సామాన్యుడు, ఆంధ్రావాలా, బిజినెస్‌మెన్‌, విక్ట‌రీ, డాన్ శీను, కిక్‌, ఢ‌మ‌రుకం, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మిర‌ప‌కాయ్‌, పైసా, పూల‌రంగ‌డు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, విక్ట‌రీ, ల‌వ్‌లీ, బ‌హుమ‌తి, ఆంగ్లంలో డివోర్స్ ఇన్విటేష‌న్ త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించారు. ఆయ‌న పూర్తిపేరు జేవీ వెంక‌ట‌ఫ‌ణీంద్రారెడ్డి. ప‌రిశ్ర‌మ‌లో చాలావ‌ర‌కు ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. ప్ర‌చారానికి దూరంగా ఉంటూ సింపుల్ లైఫ్ స్టైల్‌తో ఉండేవారు. ఆయ‌న మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌, తెలుగు చ‌ల‌న‌చిత్ర నిర్మాత‌ల మండ‌లి, తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌తోపాటు ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, క‌థానాయ‌కులు కుటుంబ స‌భ్యుల‌కు త‌మ సానుభూతిని తెలియ‌జేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: