తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒంట‌ర‌య్యారా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. త‌న‌కోసం ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని, క‌న్నెత్తి చూస్తే కాలిపోతారంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. దీనిపై ఇంత‌వ‌ర‌కు ప‌రిశ్ర‌మ నుంచి ఎవ‌రూ స్పందించ‌లేదు. మోహ‌న్‌బాబు లాంటి పెద్ద‌లు జోక్యం చేసుకోవాల‌ని ప‌వ‌న్ సూచించ‌గా, మా ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు విష్ణుకు ఓటేయాల‌ని, ఆ త‌ర్వాత మీర‌డిగిన అన్ని ప్రశ్న‌ల‌కు స‌మాధానం చెబుతాన‌ని మోహ‌న్‌బాబు ప‌వ‌న్‌కు బదులిచ్చారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ఛాంబ‌ర్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప‌వ‌న్ ఒంట‌ర‌య్యారు అనే భావ‌న త‌లెత్తింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని, ప‌రిశ్ర‌మ‌కు సంబంధం లేద‌ని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప‌రిశ్ర‌మ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని, ఆన్‌లైన్ టికెట్ల వ్య‌వ‌హారంపై పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త వస్తుంద‌ని తెలియ‌జేశారు. అయితే ఫిల్మ్‌ఛాంబ‌ర్ ఇక్క‌డ ఒక విష‌యం మ‌రిచిపోయింద‌ని ప‌వ‌న్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ మాట్లాడింది కూడా ప‌రిశ్ర‌మ క‌ష్టాల గురించేననే విష‌యం తెలియ‌దా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: