కేంద్రం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వ‌ర్యంలో భార‌త్‌బంద్ కొన‌సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంది. బంద్‌కు మ‌ద్ద‌తుగా ఏపీ ప్ర‌భుత్వం ఈరోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను నిలిపివేయ‌డంతో ప్ర‌యాణికులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. అలాగే ప‌లు ప్రాంతాల్లో వామ‌ప‌క్షాలు, తెలుగుదేశం నేత‌లు బంద్ చేయించారు. దుకాణ‌దారులు స్వ‌చ్ఛందంగా త‌మ దుకాణాలు మూసేశారు. హైద‌రాబాద్లో బంద్ ప్ర‌భావం పాక్షికంగా ఉంది. క‌మ్యూనిస్టు నాయ‌కులు ఉప్ప‌ల్‌, కూక‌ట్‌ప‌ల్లి డిపోల ముందు ధ‌ర్నాకు దిగారు. న‌ల్గొండ‌లో బంద్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్ త‌దిత‌ర రాష్ట్రాల్లో బంద్ సంపూర్ణంగా కొన‌సాగుతోంది. బంద్‌కు ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు తెలప‌డంపై భార‌తీయ జ‌న‌తాపార్టీ మండిప‌డుతోంది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు, స్వార్థ రాజ‌కీయాల‌కు వైసీపీ వేదిక‌గా నిలుస్తోందంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు పోరాటాన్నివిర‌మించేది లేద‌ని సంయుక్త కిసాన్‌మోర్చా నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: