మంచికి, చెడుకు తేడా తెలుసుకో మిత్ర‌మా అంటున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణ‌యాల‌వ‌ల్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఏ విధంగా న‌ష్ట‌పోతోందో కొద్దిరోజులుగా అంద‌రూ చూస్తున్న‌దే. అయినా ప్ర‌భుత్వం మాత్రం అనేక సాకులు చెబుతూ ప్రేక్ష‌కుల మంచికోస‌మేనంటోంది. ప‌వ‌న్ తాజాగా ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రులు పేర్ని నాని, బొత్స‌, అనిల్‌కుమార్ యాద‌వ్ బ‌దులిచ్చారు. కానీ వ‌ప‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా ఏ ఒక్క క‌థానాయ‌కుడుకానీ, క‌నీసం అత‌ని సోద‌రుడు చిరంజీవికానీ, నిర్మాత‌లుకానీ, ద‌ర్శ‌కులుకానీ ఎవ‌రూ మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేదు. నా ఒక్క‌డికోసం ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బందిపెట్ట‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ ప్ర‌భుత్వాన్ని కోరారు. కానీ అదే ప‌రిశ్ర‌మ ఏమందంటే.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌కు సంబంధంలేద‌ని, అది ఆయ‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని తేల్చేసింది. ప‌వ‌న్ మ‌న‌స్త‌త్వాన్ని మొద‌టినుంచి ప‌రిశీలించిన వారికి అయ్యోపాపం ప‌వ‌న్ అనిపిస్తుంది. ఆయ‌న ప‌రిశ్ర‌మ మేలుకోసం మాట్లాడితే అది కూడా ఆయ‌న రాజ‌కీయ పార్టీకి అంట‌క‌ట్టిన తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ గురించి ఇప్ప‌టికైనా బాగా అవ‌గాహ‌న చేసుకోవాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: