కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన 'భారత్ బంద్' చెన్నైలో సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు చెన్నైలోని అన్నాశాలై ప్రాంతంలో పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే క్ర‌మంలో పోలీసుల‌తో కొద్దిసేపు తోపులాట జ‌రిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి కొంత‌వ‌ర‌కు సద్దుమణిగింది. అనంత‌రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. వివిదాస్పద సాగు చట్టాలను రద్దుచేయాలంటూ తమిళనాడు రైతులు నిరసనలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోందని మండిప‌డ్డారు. న‌ల్ల‌చ‌ట్టాలు ర‌ద్ద‌య్యేంత‌వ‌ర‌కు త‌మ పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌ని, మరింత ఉధృతం చేసే దిశ‌గా త‌మ ప్ర‌ణాళిక‌లున్నాయ‌ని స్పష్టం చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మంచేస్తున్న రైతుల‌కు ఇంత‌వ‌ర‌కు ప్ర‌భుత్వం ఎటువంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌ని, మొద‌ట్లో జ‌రిపిన చ‌ర్చ‌లే ఇంత‌వ‌ర‌కు ఫ‌ల‌ప్ర‌దం కాలేద‌న్నారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కొమ్ముకాస్తున్న ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని రైతుల కోసం దిగివ‌చ్చేలా చేస్తామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: