ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లను ఆన్‌‌లైన్‌లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ రఘురామ త‌ప్పుప‌ట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా వ్యాపారం అనేది చాలా చిన్నద‌ని,  అలాంటిదానిపై ప్రభుత్వం అంత శ్రద్ధ ఎందుకు చూపిస్తుందో అర్థం కావ‌డంలేద‌న్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయ‌ని, రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకోవడం లేద‌ని మండిప‌డ్డారు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవ‌స‌రంలేద‌ని, ఎన్నైనా అడుగుతార‌ని, సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి..  వాళ్లకు ఇచ్చే రూ.5వేలు మేమే ఇస్తామంటారు. అంత తక్కువకు ఎవరూ రారు. మీరు వాలంటీర్ల పేర్లతో మాకు కేటాయించండి అని అడిగితే ఇస్తారా?  మీరు.. అడగడానికి వాళ్లెవరు?.. ఓకే చెప్పడానికి వీళ్లెవరు?..  పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని తాను సమర్థిస్తున్నాన‌న్నారు. పవన్ కల్యాణ్ చాలా స్ప‌ష్టంగా చెప్పార‌ని, తన మీద కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారనే ఆవేదన ప‌వ‌న్  మాటల్లో కనిపించింద‌ని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: