జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల రిపబ్లిక్ ఆడియో రిలీజ్ కార్యక్రమం లో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రుల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సినీ పరిశ్రమలో ఇబ్బంది పెట్టొద్దని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత మంది మంత్రులను టార్గెట్గా చేసుకుని చేసిన విమర్శలు మీడియా వర్గాల్లో హైలైట్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే నెల మూడో తారీకు న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఒక ఫంక్షన్ హాల్లో ఆయన జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై రేపు ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: