గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం ఇప్పుడు ముప్ప తిప్పలు పెడుతుంది. అధికారులు నగర వ్యాప్తంగా పూర్తిగా చర్యలు చేపట్టి ఎవరిని బయటకు రావొద్దు అని హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎవరు బయటకు రావద్దంటున్న బల్దియా... చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఈరోజు రాత్రి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ బల్దియా హెచ్చరికలు చేసింది. అత్యవసరమైతే జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలంటూ జీహెచ్ఎంసీ అధికారుల సూచనలు చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసారు. అనవసరంగా బయటకు రావొద్దని  బయటకు వచ్చిన వారు ఇళ్ళకు వెళ్లిపోవాలి అని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: