గులాబ్ తుఫాన్ దెబ్బకు ఇప్పుడు ఉత్తరాంధ్ర చుక్కలు చూస్తుంది అనే మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఓడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అధికారులు అంటున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో కుండపోత వర్షం పడింది.

అదే విధంగా  హైదరాబాద్ లో దాదాపు రెండు గంటల నుంచి భారీ వర్షం పడుతుంది. అధికారులు అందరూ కూడా ప్రజలను రక్షించడానికి రంగంలోకి దిగారు. ఇక ఇదిలా ఉంటే విశాఖ ఎయిర్పోర్టుకు వరద ముప్పు  పొంచి ఉందని తెలుస్తుంది. విమానాశ్రయం కు వరద నీరు భారీగా చేరుతుంది. ప్రయాణికులు అందరూ కూడా ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ఎగువన ఉన్న మేఘాద్రి రిజర్వాయర్ నుండి భారీగా క్రిందకు చేరుతున్నది వరద.

మరింత సమాచారం తెలుసుకోండి: