భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు మ‌రో స‌రికొత్త అత్యాధునిక ర‌వాణా స‌దుపాయం అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్ నుంచి దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబ‌యికి మూడుగంట‌ల్లో బుల్లెట్ రైలు ద్వారా చేరుకోబోతున్నారు. ఇప్ప‌టికే న‌గ‌ర‌వాసుల‌కు మెట్రో రైలు అందుబాటులో ఉంది. హైద‌రాబాద్‌-ముంబ‌యి మ‌ధ్య హైస్పీడ్ రైలు మార్గం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల‌పై దృష్టిసారించ‌డంతోపాటు భూసేక‌ర‌ణ‌పై కూడా కేంద్రం దృష్టిసారించింది. మ‌హారాష్ట్ర‌లోని ఠాణె జిల్లా అధికారుల‌కు ఈ ప్ర‌తిపాదిత మార్గం గురించి స‌మాచారాన్ని పంపించింది. ఈ మార్గంలో తెలంగాణ‌, మ‌హారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో 11 స్టేష‌న్లు ఉంటాయి. ఈ ప్ర‌ణాళిక‌కు సంబంధించిన మొత్తం వివ‌రాల‌ను జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేష‌న్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఠాణె డిప్యూటీ క‌లెక్ట‌ర్‌తోపాటు ఇత‌ర అధికారుల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. హైద‌రాబాద్ నుంచి ముంబ‌యికి 650 కిలోమీట‌ర్ల దూరం కాగా ప్ర‌స్తుతం 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. బులెట్ రైలు అందుబాటులోకి వ‌స్తే ప్ర‌యాణ స‌మ‌యం మూడు గంట‌ల‌కు త‌గ్గ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: