రాజ‌మండ్రి పంచాయితీ తాడేప‌ల్లికి చేరింది. ఎంపీ భ‌ర‌త్‌, రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రినీ పిలిచి మాట్లాడాల‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌వేక్ష‌కుడు వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించారు. ఆయ‌న వీరిని పిలిపించి చ‌ర్చిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా వీరితో భేటీ అయ్యే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల‌కు సంబంధించిన ప‌రిహారం అందించేందుకు రైతుల‌చేత బ్యాంకు ఖాతాలు తెర‌పించి వ‌సూళ్ల‌కు పాల్ప‌డ‌తున్నారంటూ ఎమ్మెల్యే రాజా ఎంపీపై ఆరోప‌ణ‌లు చేశారు. చీక‌టి రాజ‌కీయాలు ఎవ‌రు చేస్తున్నారో అంద‌రికీ తెలుస‌ని, రైతుల ద‌గ్గ‌ర నుంచివ‌సూళ్లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌ర‌త్ ప్ర‌త్యారోప‌ణ చేశారు. ఇదే కాకుండా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ఏ విష‌యంలో కూడా పొస‌గ‌డంలేదు. పార్టీకి న‌ష్టం క‌లుగుతుందంటూ ప‌రిశీల‌కులు చెబుతుండ‌టంతో వారిని పిలిపించి మాట్లాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: