విజయవాడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. కొందరు కుర్రాళ్ళు పనులు పోలీసులకు కూడా తల నొప్పిగా మారాయి. విజయవాడలో పెచ్చు మీరుతున్నాయి ఆకతాయిల ఆగడాలు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. బైక్ పై నిలబడి గన్ తో పైకి కాల్చుతూ హల్ చల్ చేస్తున్నారు కొందరు యువకులు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మీద పోలీసులు దృష్టి పెట్టారు. ఫోటో షూట్ పేరుతో విన్యాసాలకు పాల్పడుతున్నారు యువకులు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు వాహన చోదకులు, స్థానికులు. కేటియెం , పల్సర్ 220 బైక్ ల నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలకు దిగారు. యువకులను గుర్తించే పనిలో పడ్డారు విజయవాడ పోలీసులు. గన్ నకిలీదో ఒరిజినల్ దో విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap