హైదరాబాద్ లో నిన్న భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లో మరో రెండు రోజులు భారీ వర్షం పడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. ఇక హైదరాబాద్ కు భారీ వరద ముప్పు ఉండే అవకాశం ఉంది. భాగ్య నగరంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. జియాగూడా టు పురానా పూల్ మార్గం మూసివేసిన పోలీసులు... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

చాదర్ ఘాట్ బ్రిడ్జి మూసివేసారు. మూసీ వరద ఉధృతి దృష్ట్యా మూసారాం బాగ్ బ్రిడ్జి పై రాకపోకలు బంద్ చేసారు అధికారులు. హిమాయత్ సాగర్ నుంచి మూసీలో భారీగా వరద వస్తుందని అధికారులు వెల్లడించారు. జియా గూడా, పురణా పూల్, కిషన్ బాగ్, చాదర్ ఘాట్ , శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్ ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts