‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పార్టీ రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్‌ దాఖలు చేసారు దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌. తన పేరుతో పార్టీ పెట్టడంపై అభ్యంతరం తెలిపిన నటుడు విజయ్‌... అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తల్లిదండ్రులతో సహా 13 మందిపై కేసులు పెట్టాడు హీరో విజయ్. ఇటీవల జరిగిన ఈ వ్యవహారం సంచలనం అయింది.

తన పేరు మీద ఏర్పాటుచేసిన పార్టీపై నిషేధం విధించాలని కోర్టులో విజయ్ పిటిషన్‌ దాఖలు చేయగా నేడు విచారణ జరిగింది. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు సమాధాన పిటిషన్‌ ను దాఖలు చేసారు విజయ్ తండ్రి చంద్రశేఖర్‌. ఇక విజయ్ రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి తమిళనాట ఎప్పటి నుంచో చర్చలు ఉంటూనే ఉన్నాయి. కాని దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: