ఏపీలో గులాబ్ తుఫాన్ ప్ర‌జ‌ల గుండెల్లో గుబులు రేపుతోంది.. గులాబ్ తుఫాన్ ప్ర‌భావంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వ‌నికిపోతుండ‌గా..భ‌వ‌నాలు ఎక్క‌డ కూలిపోతాయోన‌ని కూడా ఆందోళ‌న చెందుతున్నారు. ఇక తాజాగా ఏపీలోని పాడేరులో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్టు స‌మాచారం. పాడేరు కొట్ల‌గ‌రువులో పాఠ‌శాల భ‌వ‌నం కుప్ప‌కూలింది. గ‌త రెండు రోజులుగా గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో కురుస్తున్న వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలిపోయిన‌ట్టు తెలుస్తోంది. 

అయితే పాఠ‌శాల‌లో భ‌వ‌నం కూలిన సమ‌యానికి విద్యార్థులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గులాబ్ తుఫాన్ కార‌ణంగా రెండు రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండటంతో జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ల్లికార్జున వారు జిల్లాలోని పాఠ‌శాల‌లకు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక వ‌ర్షానికి పాఠ‌శాల భ‌వ‌నం కూలిపోవ‌డంపై గ్రామస్తులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త భ‌వ‌నం నిర్మించ‌క‌పోవ‌డంతోనే ఈ ప్రమాదం జ‌రిగింద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: