హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర స్పీడ్ పెంచారు. హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు నేడు. సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారు అని అన్నారు ఆయన. రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు.

టీఆర్ఎస్ నీచపు పార్టీ, ఆ పార్టీనేతలు నీచపు మనుషులు అని విమర్శలు చేసారు. చిల్లర చేష్టలు చేస్తే.. ప్రజలు సహించరు అని హెచ్చరించారు. కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు ఆయన. ఆర్డీవో ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. అక్టోబర్ రెండున హుజురాబాద్ లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుంది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts