పంజాబ్ కాంగ్రెస్ లో మ‌రో కీల‌క ప‌రినామం చోటుచేసుకుంది. పంజాబ్ పీసీసీ ప‌ద‌వికి న‌వ‌జోత్ సిద్దూ రాజీనామా చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. అయితే పీసీసీ ప‌ద‌వికి తాను రాజీనామా చేసిన‌ప్ప‌టికీ ఫ్యూచ‌ర్ లో కాంగ్రెస్ లోనే సేవ‌లు అందిస్తాన‌ని సిద్దూ చెప్పుకొచ్చ‌రు. సిద్దూ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా రాజీనామాను ప్ర‌క‌టించారు. అంతే కాకుండా తాను రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి రాసిన లేఖ‌ను కూడా జోడించారు. ఒక మ‌నిషి ప‌త‌నం అనేది రాజీ ప‌డ‌టం నుండే ఆరంభం అవుతుంది. 

నేను పంజాబ్ భ‌విష్య‌త్ విష‌యంలో రాజీ ప‌డ‌లేను. అందుకే పంజాబ్ పీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నా అంటూ సిద్దూ త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా తాను పీసీసీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ కు సేవ‌లు అందిస్తూనే ఉంటాన‌ని సిద్దూ లేఖ‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సీఎం ప‌ద‌వికి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: