మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ రాజకీయాలు చూసి ప్ర‌జ‌లే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ‌పార్టీల నేత‌లు ముక్కున వేల‌సుకుంటున్నారు. మా నుంచే రాజ‌కీయ పాఠాలు నేర్వాల‌నుకుంటున్నారంటూ అతిశ‌యోక్తి కాదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశంకానీ, జ‌న‌సేన కానీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ కానీ, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర‌స‌మితి కానీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా స‌రే.. మా ఎన్నిక‌ల కోసం జ‌రిగిన ప్ర‌చారం కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎత్తుగ‌డ‌లుకానీ, ఎన్నిక‌ల త‌ర్వాత రాజీనామాల ప‌ర్వం కానీ చూసి ఔరా అంటున్నారు. ఈ రాజ‌కీయాలు ఎన్నిక‌ల్లో మనం చేయ‌గ‌లిగితే ఎప్పుడో అధికారంలోకి వ‌చ్చేవాళ్లం క‌దా అని ఏపీలో తెలుగుదేశం, తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీ భావిస్తున్న‌ట్లున్నాయి. వెండితెర‌పై త‌మ న‌ట‌న‌తో వెలుగు జిలులుగు పంచ‌డ‌మేకాదు.. వెండితెర వెన‌క అద్భుత‌మైన రాజ‌కీయాలు కూడా చేయ‌గ‌ల‌మ‌ని నిరూపిస్తున్నారు. సినిమా వాళ్లు రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తున్నార్రా? అనే సందేహం అంద‌రికీ ఉండేది. ఇప్పుడు మా ఎన్నిక‌లు చూసిన త‌ర్వాత వారికి ఆ అనుమానం ప‌టాపంచ‌ల‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa