గంజికి లేని దేశాన గంజాయికి ఏం లోటు లేదు. కూటి లేని దేశాన కూలోళ్ల‌కూ లేదు. మాయ నేర్చిన మ‌నుషులే దేశాన హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. బాగుంది. ప్ర‌భుత్వం, పోలీసు, చ‌ట్టం ఇవ‌న్నీ ఏం చేస్తున్నాయి అని విశాఖ మ‌న్యం చూసి ప్ర‌శ్నించ‌డం మానుకోండి.నేను చెబుతున్నాను ఎన్ని వేల ఎక‌రాల్లో గంజాయి సాగు అయినా ప‌ట్టించుకునే నాథుడే ఉండ‌డు. వారి గురించి అడిగే వారూ ఉండ‌రు. ఇదంతా మాయా రాజ్యం. విశాఖ మ‌న్యంలో 15 వేల ఎక‌రాల‌కు పైగా సాగ‌వుతున్న గంజాయి కొత్త స‌వాళ్ల‌ను విసురుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసుల‌నూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. సాగ‌వుతున్న గంజాయి విలువ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డి నుంచి యూపీ, ఇక్క‌డి నుంచి ఎంపీ, రాజ‌స్థాన్, హ‌రియాణా, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ, చెన్నై, ఒడిశా, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ‌కు య‌థేచ్ఛ‌గా గంజాయి త‌ర‌లిపోతోంది. అయినా పోలీసులకు అది చిక్క‌దు. స్పెష‌ల్ పోలీసు బృందాల‌కు అది దొర‌క‌దు. ఈ దాగుడు మూత‌లు ఎంత కాలం అని మాత్రం ప్ర‌శ్నించ‌కండి. అదొక నేరం.. మ‌రియు మీకు త‌ప్ప‌దు శిక్ష.వైసీపీ స‌ర్కారు ఏం చేస్తుంద‌ని కూడా ప్ర‌శ్నించ‌కండి ప్లీజ్!


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp