త‌మిళ‌నాడులోని తొమ్మిది జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న  డీఎంకే ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ జిల్లాల్లోని జిల్లా పంచాయతీ యూనియన్లన్నింటినీ గెలుచుకుంది. జిల్లా పంచాయతీ యూనియన్‌ సభ్యులుగా డీఎంకే అభ్యర్థులే అత్యధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. రాత్రి వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల్లో డీఎంకే 140 జిల్లా పంచాయతీ యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకుగాను 99 గెలుచుకుంది. అన్నాడీఎంకే తరఫున ఐదుగురు విజ‌యం సాధించారు. ఇక 1381 యూనియన్‌ కౌన్సిలర్ల పదవులకు జరిగిన ఎన్నికల్లో 325 మంది డీఎంకే అభ్యర్థులు గెలుపొంద‌గా, అన్నాడీఎంకే తరఫున 47 మంది గెల‌వ‌గ‌లిగారు.  డీఎండీకే ఒక్క స్థానంలో తన ఖాతాను తెరిచింది. పీఎంకే కూడా ఒక స్థానాన్ని గెలుచుకోగ‌లిగింది. బీజేపీ, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం, నామ్‌ తమిళర్‌ కట్చి ఘోరంగా ఓడిపోవ‌డంతోపాటు డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక‌పోయారు. ముఖ్య‌మంత్రిగా స్టాలిన్ తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఆయ‌న నిరంత‌రం పాటుప‌డుతుండ‌టంలాంటివ‌న్నీ డీఎంకేకు క‌లిసివ‌చ్చాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

dmk