గ‌త కొంత కాలంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. భార‌త్‌లో సైతం బెంబేలెత్తించింది. కానీ తాజాగా భార‌త్‌లో కోవిడ్ 19 కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. థ‌ర్డ్‌వేవు ఉంటుంద‌ని గ‌తంలో ప‌లువురు నిపుణులు హెచ్చరించారు. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి మాత్రం క‌నిపంచ‌డం లేదు. కొత్త కేసులు త‌గ్గాయి. నూత‌న కేసుల‌తో పాటు మ‌ర‌ణాల రేటు కూడా త‌గ్గ‌ముఖం ప‌ట్టింది. రీక‌వ‌రీ ఎక్కువ‌గా ఉంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 15,823 కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి.  నిన్న 22,844 మంది కోలుకున్నారు. క‌రోనాతో దేశ‌వ్యాప్తంగా 226 మంది మృతిచెందారు. తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి 3,40,01,743 కేసులు  న‌మోద‌య్యాయి.  ఇప్ప‌టివ‌ర‌కు 3,33,42,901 మంది కోలుకున్నారు. 4,51,189 మంది ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దేశంలో ప్ర‌స్తుతం 2,07,653 యాక్టివ్ కేసులున్నాయి. మొన్న‌టివ‌ర‌కు కేర‌ళ‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. తాజాగా అక్క‌డ కూడ కేసులు త‌గ్గాయి. కేర‌ళ‌వ్యాప్తంగా 7,823 మందికి కోవిడ్ 19 సోకింది. 106 మంది మృతి చెందారు కేర‌ళ‌లో.  ఇక క‌రోనా టీకా విష‌యానికి వ‌స్తే 50,63,845 మంది దేశ‌వ్యాప్తంగా టీకా తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 96.43 కోట్ల డోసులను వ్యాక్సిన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: