మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌గ‌డ అలాగే ఉంటోంది. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాతే ఇంకా ఎక్కువైంది. ఇదంతా ఎందుకు జ‌రుగుతోంది అంటే తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ప‌ట్టు స‌డ‌ల‌కుండా ఉండేందుకు ఒక వ‌ర్గం జ‌రుపుతున్న తెర‌వెన‌క పోరాటం అని చెప్ప‌వ‌చ్చు. తెర‌పైకి రాకుండా ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌కాంత్ లాంటివాళ్ల‌ను పెట్టి న‌డుపుతున్న సినిమా ఇది. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌వారెవ‌రు? అనేది ఇప్పుడు తెలుసుకోవ‌డానికి అంద‌రూ ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతా మ‌న‌వారే.. అంతా మ‌న‌దే.. అంద‌రూ బాగుండాలి అనుకున్న‌ప్పుడు ఏ గొడ‌వా ఉండ‌దు. అలా కాకుండా మా సినిమాలే ఉండాలి.. మా హీరోలే ఉండాలి.. మా ధియేట‌ర్లే నిండాలి.. వ్యాపారం మాతోనే జ‌ర‌గాలి అనుకుంటున్నప్పుడే చిక్కొచ్చిప‌డింది. ఏపీలో జ‌గ‌న్ ఉండ‌టం, ఇక్క‌డ మోహ‌న్‌బాబు త‌న‌యుడు గెలుపొందడంవ‌ల్ల త‌మ ఆధిప‌త్యం త‌గ్గ‌డంతోపాటు ఒక‌సారి ప‌ట్టుతప్పితే మోహ‌న్‌బాబులాంటి వారి నుంచి అది తిరిగి చేజిక్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న ఉండ‌టంవ‌ల్లే రాజ‌కీయం న‌డుపుతున్నారు అంటున్నారు సినీ విశ్లేష‌కులు. అది ఎంత‌వ‌ర‌కు వాస్త‌వ‌మ‌నేది న‌డిపేవారికి, వారిచేత న‌డ‌ప‌బ‌డుతున్న‌వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa