కేంద్ర‌ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన గ‌తిశ‌క్తి మాస్ట‌ర్ ప్లాన్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ బుధ‌వారం ఆవిస్క‌రించారు. ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదానంలో నూత‌న ఎగ్జిబిష‌న్ కాంప్లెక్స్ ను స‌మీక్షించారు. అనంత‌రం ప్ర‌ధాని మోడీ మాస్ట‌ర్ ప్లాన్‌ను ఆవిష్క‌ర‌ణ చేశారు. మ‌ల్టీమోడ‌ల్ క‌నెక్టివిటీ దేశంలోని మౌలిక స‌దుపాయాల రంగంలో స‌మూల‌మైన మార్పుల‌ను తీసుకురానుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను 2024-25 వ‌ర‌కు పూర్తి చేసేందుకు కేంద్రప్ర‌భుత్వం ఒక ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. మౌలిక వ‌స‌తుల నిర్మాణాన్ని సంపూర్ణంగా, వేగంగా కొన‌సాగించ‌డానికి గ‌తిశ‌క్తి కార్య‌క్ర‌మం చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు మోడీ. దేశంలో వ్యాపారరంగంలో పోటీని పెంచ‌డానికి టెక్స్‌టైల్స్‌, ఫార్మాసూటిక‌ల్స్‌, డిఫెన్స్‌కారిడార్‌, ఎల‌క్ట్రానిక్ పార్కులు, ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్లు, ఫిషింగ్ క్ల‌స్ట‌ర్లు, అగ్రిజోన్స్‌ను అనుసంధానం చేస్తారు. దీనిద్వారా ఉత్పాద‌క‌త పెరుగుతుంది. భ‌విష్య‌త్‌లో ఆర్థిక మండ‌ళ్ల‌ను తీర్చ‌డానికి గ‌తిశ‌క్తి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మోడీ పేర్కొన్నారు.  గ‌తిశ‌క్తి ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: