మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌గ‌డ చూసిన త‌ర్వాత అంద‌రూ చిత్రం భ‌ళారే విచిత్రం అంటున్నారు. ఈ పేరుతో విడుద‌లైన సీనియ‌ర్ న‌రేష్ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కొన్ని కేంద్రాల్లో 200 రోజులు, మ‌రికొన్ని కేంద్రాల్లో 300 రోజులు కూడా దిగ్విజ‌యం ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. ఆ చిత్రంలోని క‌థానాయ‌కుడు న‌రేష్ ఇప్పుడు మా ఎన్నిక‌ల్లో కూడా చిత్రం భ‌ళారే విచిత్రం అనిపిస్తున్నారు. మొద‌టి నుంచి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వ‌ర్గం విష్ణుక‌న్నా న‌రేష్‌పైనే ఆరోప‌ణ‌లు సంధిస్తోంది. న‌రేష్ తాను కృష్ణుడిలాంటివాడిన‌ని, విష్ణు ర‌థం ఎక్కుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ తెర‌వెన‌క రాజ‌కీయాల‌కు, చ‌క్రం తిప్ప‌డంలో మోహ‌న్‌బాబుకు, విష్ణుకు న‌రేష్ బాగాదోహ‌ద‌ప‌డ్డాడ‌ని ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాల స‌మాచారం. అస‌లు రాజ‌కీయం మొత్తం న‌రేష్ ద‌గ్గ‌రే ఉందంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే శివాజీరాజా ఆరోప‌ణ‌లు కూడా బ‌లం చేకూరుస్తున్నాయి. కానీ ఇంత‌వ‌ర‌కు న‌రేష్ నోరు మెద‌ప‌డంలేదు. అంటే మౌనం అర్థాంగీకార‌మ‌నే అనుకోవ‌చ్చంటున్నారు. మ‌రి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ చేసిన రాజీనామాల ప‌ర్వానికి పై ఎత్తు న‌రేష్ ఏం వేయ‌బోతున్నారన‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa