మా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ మీడియా స‌మావేశం పెట్టిన‌ప్పుడు విలేక‌రులంతా ఒక ప్రశ్న అడిగారు. మాకు పోటీగా మ‌రో సంఘం పెడుతున్నారంట‌క‌దా అని, కానీ అటువంటిదేమీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగానే చెప్పిన‌ప్ప‌టికీ ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వెన‌క‌నుంచి మ‌ద్ద‌తిచ్చిన చిరంజీవి కుటుంబం వేరే సంఘం ఏర్పాటు చేయించ‌బోతోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈరోజు మీడియాతో మాట్లాడిన నాగ‌బాబు త‌మ కుటుంబం అటువంటి ఆలోచ‌నేదీ చేయ‌డంలేద‌ని తేల్చిచెప్పారు. ప్ర‌కాష్రాజ్‌ను స్థానికుడు కాదు.. నాన్ లోక‌ల్ అంటూ సంకుచిత మ‌న‌స్త‌త్వంతో మాట్లాడిన త‌ర్వాత మాలో ఉండాల‌నిపించ‌లేద‌ని చెప్పారు. త‌న అన్న‌య్య చిరంజీవి కూడా ఎప్పుడూ అలా ఆలోచించ‌లేద‌ని, పెద‌రాయుడిలా సింహాస‌నంపై కూర్చొని సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద అనిపించుకోవాల‌ని ఆరాట‌ప‌డ‌లేద‌న్నారు. పెద్ద‌రికం చ‌లాయిస్తాన‌నే ఆలోచ‌నే ఎప్పుడూ లేద‌ని, ఆయ‌న అహంకారి కాద‌న్నారు. మ‌న‌స్తాపంతో బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని, ఈ అసోసియేష‌న్‌లో ఉండాల‌నిపించ‌లేద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa