మా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష్ణుకు చాలా ప‌నులు ఉంటాయ‌ని, అత‌ని జోలికి ఎవ‌రూ రావొద్ద‌ని, డిస్ట‌ర్బ్ చేయొద్ద‌ని న‌రేష్ వ్యాఖ్యానించారు. త‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు విష్ణుకు అప్ప‌గించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. దేశంలో మోడీ గెలిచార‌ని కాంగ్రెస్ పార్టీ దేశం వ‌దిలి వెళ్లిపోయిందా? అని ప్ర‌శ్నించారు. మ‌రి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన‌వారు ఎందుకు రాజీనామాలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రం క‌లిసిప‌నిచేద్దామ‌ని చెప్పి.. ఇప్పుడేమో రాజీనామాలు చేస్తున్నార‌ని, మా స‌భ్యులెవ‌రూ రాజీనామాలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని, ఎన్నిక‌లైన త‌ర్వాత కూడా ఆరోప‌ణ‌లెందుక‌ని ప్ర‌శ్నించారు. మా అనేది ఒక సేవా సంస్థ అని, కొత్త పాల‌క‌వ‌ర్గాన్ని ప్ర‌శాంతంగా ప‌నిచేసుకోనివ్వాల‌ని సూచించారు.
ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజుకున్న వేడి ఇంత‌వ‌ర‌కు చ‌ల్లార‌లేదు. మా స‌భ్యులంతా ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాజీనామాలు స‌మ‌ర్పిస్తున్నారు. కానీ మాలో ఉన్న పేద క‌ళాకారుల గురించి మాత్రం ఆలోచించ‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag