మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఆ వేడి చ‌ల్లార‌డంలేదు. ఒక‌ర‌కంగా ఇంకా ఎక్కువైంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాజీనామాలు చేస్తూ ఒక వ‌ర్గం, బాధ్య‌త‌లు చేప‌డుతూ మ‌రోవ‌ర్గం బిజీగా ఉన్నాయి. కానీ ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకొని జీవ‌నం సాగిస్తున్న పేద క‌ళాకారుల గురించి మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. వీరికి ఆ అవ‌స‌రం కూడా లేదు. ఎంత‌సేప‌టికి త‌మ ఆధిప‌త్యాన్ని నిరూపించుకోవ‌డానికి, తాము పైచేయి సాధించామ‌ని చెప్పుకోవ‌డానికేకానీ వీరు నిజంగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న పేద క‌ళాకారుల‌కు సాయం చేయ‌గ‌లుగుతారా? అనేది సందేహంగానే మిగిలిపోతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కు, చేసిన ప్ర‌సంగాల‌కు, ఎన్నికలైన త‌ర్వాత వారు వ్య‌వ‌హ‌రిస్తున్న విధానాల‌కు ఎంతో తేడా క‌న‌ప‌డుతోంది. విష్ణు ఈరోజు బాధ్య‌త‌లు చేపట్టారు. నిన్న ప్ర‌కాష్రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామాలు చేశారు. అసోసియేష‌న్ స‌భ్య‌త్వ రుసుమును రూ.ల‌క్ష నుంచి రూ.75వేల‌కు త‌గ్గిస్తాన‌ని హామీ ఇచ్చిన విష్ణు దానిని ఎలా నెర‌వేరుస్తారో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa