రష్యాలో కరోనా తీవ్రస్థాయి లో విరుచుకు పడుతూవుంది. అక్కడ ఎవరుకూడా వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రక పోవడం తో కరోనా కేసులు ఒక్కరోజులోనే 28,717  కేసులు   నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 984 మంది చనిపోయారు. రష్యాకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉన్నప్పటికీ ఆ దేశప్రజలు వ్యాక్సిన్ ని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనికి గల కారణం వారిలో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపనమ్మకమే. కరోనా టాస్క్ ఫోర్స్ లెక్కల ప్రకారం దేశంలో 146 కోట్ల జనాభా ఉండగా అందులో కేవలం 29 %  మాత్రమే వాక్సిన్ తీసుకున్నారు.



 ఆ కారణంగా రష్యాలో నానాటికి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ఈ విషయాలను మంగళవారం నాడు తెలియజేసారు. ఇప్పటివరకు 7.8 మిల్లియన్ కేసులు నమోదు అవ్వగా అందులో 2,19,329 మంది తీవ్ర లక్షణాలతో బాధపడుతూ చనిపోయారని తెలిపారు. అందువలన వాక్సినేషన్ స్పీడ్ పెంచాలని రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్‌ పుతిన్‌ కోరారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి రష్యాలో లాక్ డౌన్ విధిస్తారని వార్తలను ఆదేశ మంత్రి క్రెమ్లిన్ కందించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రదేశాల్లో కోవిద్ నిబంధనలను అమలు చేయబోతున్నట్లు తెలియజేసారు  


మరింత సమాచారం తెలుసుకోండి: