జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి తేదీని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తేదీ లకు సంబంధించి పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు వద్ద పలు అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతాపార్టీ సహకరించినా సహకరించకపోయినా సరే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని సమాచారం.

పార్టీలో కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారందరిలో  కూడా స్ఫూర్తి నింపే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్ర పర్యటనల కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని పార్టీ నాయకులు అందరితో కూడా మాట్లాడిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: