త్వరలో కేంద్ర  కేబినెట్  సమావేశం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర  కేబినెట్ లో  దేశంలో విద్యుత్ సంక్షోభం గురించి కీలక చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంబంధించి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా కూడా విద్యుత్ సంక్షోభంపై కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

పదేళ్ల క్రితం విద్యుత్ కోతలు అంటే ఒక రకంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం విద్యుత్ కోతలు అనే పదం వినపడితే కామెడీగా ఉంది అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేందుకు సిద్ధమవుతుందని కేబినెట్  సమావేశంలో దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap