హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి ఎవరొస్తారు ఏంటనే దానిపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్గాల్లో కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా కేంద్ర మంత్రులు నలుగురు ప్రచారం చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

పలువురు ఎంపీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉందని అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అలాగే కర్నాటక మంత్రులు కూడా కొంతమంది గుజరాత్ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుగు వచ్చిన బిజెపి మంత్రులను ఇక్కడకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts