విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేయ‌డ‌మే కాకుండా వాటిని అరిక‌ట్టేందుకు వెళ్లిన పోలీసుల‌పై రెచ్చిపోతున్నారు. తాజాగా న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పోలీసులు త‌నిఖీ కోసం విశాఖ ఏజెన్సీ ప్రాంతాల‌కు వెళ్లారు. అక్క‌డ ఎక్క‌డెక్క‌డ గంజాయి మొక్క‌ల‌ను పెంచుతున్నారో.. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నం చేయ‌గా వారిపై దాడికి పాల్ప‌డ్డారు.

పోలీసుల‌ను చూసి గంజాయి స్మ‌గ్ల‌ర్లు రాళ్లు రువ్వారు. ఇటీవ‌ల న‌ల్ల‌గొండ జిల్లాలోని న‌కిరేక‌ల్ వ‌ద్ద కారుకు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో  గంజాయి ల‌భ్య‌మైంది.  ఇదేకాకుండా ప‌లుమార్లు న‌ల్గొండ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో గంజాయిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు 17 బృందాలుగా జ‌ల్లెడ ప‌డుతున్నారు. రాళ్ల‌పై దాడికి య‌త్నించిన వారిని పోలీసులు గుర్తించిన‌ట్టు స‌మాచారం. పోలీసులు కేవ‌లం ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే 10 రౌండ్ల‌పాటు కాల్పులు జ‌రిపామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం ఒక తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కావ‌డం లేదు గంజాయి. విశాఖ‌లో పండించిన గంజాయి దేశ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. గంజాయి ద్వారా కోట్ల ఆదాయం సంపాదిస్తున్నార‌ని.. అందుకే పోలీసుల‌ను సైతం రాళ్ల‌తో రువ్వుతున్నార‌ని స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: