ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో గ్రామంలో ఉన్న నాటు వైద్యుడు ఓబిశెట్టి ఓబయ్య వద్దకు వెళ్లిన వంకాయల విజయమ్మ అనే మహిళను అత్యాచారం చేసి చంపేసాడు. విజయమ్మ వైద్యానికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఉన్న వైద్యుడు ఓబయ్య.. అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించడంతో ప్రతిఘటించిన విజయమ్మను, గొంతు కోసి హత్య చేసాడు.

మూడు గంటల పాటు శవాన్ని తన ఇంట్లోనే ఉంచాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలం వద్దకు వెళ్లి ఓబయ్యను తమ వాహనంలో ఎక్కించుకున్న పోలీసులకు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. ఓబయ్యను బలవంతంగా పోలీస్ వాహనం నుండి దింపి దాడి చేయటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా గ్రామస్తులు పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనితో భారీగా పోలీసులు మొహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap