ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై, సీనియర్ నేత చేజర్ల సుబ్బారెడ్డి, పలువురు నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. వైసీపీ సీనియర్ నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి చిన్నపనికి ఓ రేటు కట్టి పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడుతున్నారు అని వ్యాఖ్యలు చేసారు. పార్టీ పదవులు కూడా అమ్ముకుంటూ, ఆరు నెలలకోసారి ఒక్కొక్కరిని మారుస్తున్నారు అని విమర్శించారు.

వింజమూరు మండల కన్వీనర్ పదవిని ఆరు నెలల్లో ముగ్గురుకి మార్చారు అని అన్నారు ఆయన. జెడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50లక్షలు ఇచ్చాం అని... ఎంపీపీ పదవులకీ ఎమ్మెల్యే రేటుకట్టి అమ్మకాలు సాగించారు అని విమర్శించారు. ఎనిమిది మంది దళారులని ఏర్పాటు చేసుకుని దండకాలు సాగిస్తున్నారు అని అన్నారు. మేకపాటి కుటుంబంలో చంద్రశేఖర్ రెడ్డి ఎలా పుట్టారా అనిపిస్తుంది అంటూ జగన్ పాదయాత్ర సమయంలో పదివేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, కనీస గౌరవం లేదు అంటూ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: