రాజకీయాల్లో నోరు జారడం అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. రాజకీయంగా ఎంత బలంగా ఉన్న నాయకుడు అయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వైయస్సార్ ఆసరా కార్యక్రమం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నోరుజారారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జగనన్న లాంటి నాయకుడు బతికితే మానవ మనుగడకు మంచిది కాదనేది నా ఆలోచన అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్రంలో ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ , ఇన్ని మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని ,మానవుడై పుట్టినాక ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేయాలి  అంటూ వ్యాఖ్యానించారు. చేసే గుణం లేనప్పుడు మన పరిధిలో మనం ఉండాలి అలాంటి వ్యక్తి కాదయన , ప్రతి రోజు నిత్యం అబద్ధాలా తోను , అతని రాజకీయ లబ్ది కోసం ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి లో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: