మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. మా పై దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో ఉన్నాయన్న ప్రకాష్ రాజ్... సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులను కోరారు. రెండు ప్యానల్స్ అభ్యర్థుల సమక్షం లో సీసీ టీవీ ఫుటేజ్ ను ఇరు పక్షాల ప్యానల్స్ సభ్యులు వస్తేనే చూపిస్తామని చెప్పారు.

సర్వర్ రూమ్ ను పరిశీలిస్తున్న పోలీసులు... త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. వాటిని నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కి వచ్చాను అని ప్రకాష్ రాజ్ అన్నారు. మా ఎన్నికలు ఎలా జరిగాయి వీటిపై అనుమానాలు ఉన్నాయి అని వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు సమయంలో ఉద్రిక్తత జరిగిందని వాటిని మాకు తెలపాలి అని కోరారు. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ నుండి రీప్లే ఇవ్వడం లేదు అన్నారు. విష్ణు చెప్పారు సీసీ ఫుటేజ్ చూడమని కాని ఎన్నికల అధికారి మాత్రం కోర్టుకు వెళ్ళండి అన్నారు అని విష్ణు చాలా నమ్మకంగా ఉన్నారు  అన్నారు. నాకు సమస్య అంత కూడా మా ఎన్నికల అధికారి తోనే అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: