ఎన్నికలు జరిగిన తీరుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని మా అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రకాష్ ప్రస్తుతం పోలీసులతో కలిసి మా ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే తమ ప్యానల్ సభ్యుల రాజీనామాలు మా అధ్యక్షుడు మంచు విష్ణు కు చేరుతాయని వ్యాఖ్యానించారు. కౌంటింగ్ సమయంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలియాలి అని ప్రకాష్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల అధికారి నుండి తనకు ఎలాంటి స్పందన రాలేదని అందువల్లే తాను పోలీసులను ఆశ్రయించానని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. విష్ణు చాలా నమ్మకంగా ఉన్నారు అని కానీ సమస్య అంతా మా ఎన్నికల అధికారి తోనే సమస్య వచ్చిందని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుండి ఎలాంటి రిప్లై రావడం లేదని అన్నారు. విష్ణు సీసీ టీవీ పుటేజ్ చూడమని చెప్పారని కానీ ఎన్నికల అధికారి మాత్రం కోర్టుకు వెళ్లాలని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల ఫుటేజ్ ను మీడియా కి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: