తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు బయలుదేరుతున్నారు. ఉదయం 11 : 30 నిమిషాలకు కెసిఆర్ హైదరాబాద్ నుండి యాదాద్రి బయలుదేరుతారు. ఇప్పటికే యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. యాదాద్రి కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. పనులు పూర్తయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్నింటిని మరొకసారి పరిశీలించనున్నారు. అంతేకాకుండా యాదాద్రి పున ప్రారంభం తేదీ ముహూర్తాన్ని కూడా ఇప్పటికే చిన్న జీయర్ స్వామి నిర్ణయించారు.

కాగా సీఎం కేసీఆర్ యాదాద్రి లో ఆలయ పున ప్రారంభం తేదీని స్వయంగా ప్రకటిస్తారు. అంతే కాకుండా పున ప్రారంభం సందర్భంగా నిర్వహించబోయే మహా సుదర్శన యాగం వివరాలను మరియు నిర్వహించే తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ లోనే అతిపెద్ద పుణ్య క్షేత్రంగా యాదాద్రిని రూపొందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని సైతం చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: