తెలంగాణ పుణ్య‌క్షేత్రాల‌లో ఒక‌టైన యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని ఈరోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు ప‌రిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.  రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు యాదాద్రి ప‌ర్య‌వేక్ష‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.  అప్ప‌టికే ఉన్న దేవాల‌యాన్ని పునఃప్రారంభించ‌డాన్ని మ‌హాకుంభ‌సంప్రోక్ష‌ణం అంటారు. యాదాద్రి మ‌హాకుంభ‌సంప్రోక్ష‌ణం మార్చి 22 2022న  ప్రారంభం అవుతుంది.
 
తొమ్మిది రోజుల ముందుగానే మ‌హాసుద‌ర్శ‌న‌యాగం అంకురార్ప‌ణ‌ నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. మ‌హాసుద‌ర్శ‌న యాగానికి 1ల‌క్ష‌50వేల కేజీల నెయ్యి అవ‌స‌రం అవుతుంద‌ని  తెలిపారు. ఇందుకోసం ప్ర‌తిగ్రామాన్ని భాగ‌స్వామ్యం చేయబోతున్నాం. 125 కేజీల బంగారం అవ‌స‌రం ఉంటుంది. స్వామివారి విమాన గోపురానికి స్వ‌ర్ణ‌తాప‌డం చేయించ‌బోతున్నాం. తొలి విరాళంగా 16 తులాల బంగారం అందిస్తున్నాం. చిన‌జీయ‌ర్ స్వామి 1 కేజీ బంగారం ఇస్తాం అని చెప్పారు. ప‌లువురు ధాత‌లు ముందుకు వ‌చ్చారు. గొప్ప పుణ్య‌క్షేత్రం వ‌ల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంద‌ని వెల్ల‌డించారు. గ్రామం నుంచి 11 రూపాయ‌లు ఇచ్చినా స‌రిపోతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: