చిరువ్యాపారుల కోసం జ‌గ‌న‌న్న తోడు ద్వారా ఆర్థిక చేయూత‌నందించేందుకు ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు ఏపీ సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. బుధ‌వారం తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఏడాదికి రెండు సార్లు జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలిపారు. డిసెంబ‌ర్‌, జూన్‌ల‌లో.. చిరువ్యాపారుల‌కు జ‌గ‌న‌న్న తోడు ఎంతో ఆస‌రాగా నిలుస్తున్న‌ద‌ని వివ‌రించారు. చిరువ్యాపారుల క‌ష్టాల‌ను తాను పాద‌యాత్ర‌లో తెలుసుకున్నాన‌ని వివ‌రించారు. 2020 నవంబ‌ర్‌లో జ‌గ‌న‌న్న తోడు ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

ఈ ప‌థ‌కం ద్వారా రుణాలు తీసుకొని స‌కాలంలో చెల్లించే వారికి ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. చెల్లింక‌పోతే ప్ర‌యోజ‌నం అనేది ఉండ‌దు. ప్ర‌తినెల ఈఎంఐ చెల్లించాలి. గ‌డువు దాటిన‌ట్ట‌యితే సున్నా వ‌డ్డీ అనేది రాదు. 90 రోజులు గ‌డువు దాటిన‌ప్పుడు అది వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి ప్ర‌తి ల‌బ్దిదారుడు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. గ‌త ప్ర‌భుత్వాలు చిరువ్యాపారుల‌ను అస‌లు ప‌ట్టించుకోలేదు. 4,50,546 మంది చిరువ్యాపారులు ల‌బ్ది పొందారు. ల‌బ్దిదారుల ఖాతాలో 16.36 కోట్ల వ‌డ్డీ జ‌మ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: