శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో చాముండిదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఈనెల 7 నుంచి 15 వరకు 74,480 మంది దర్శించుకోగా రూ. 40.11 లక్షల ఆదాయం దేవాల‌యానికి వ‌చ్చిన‌ట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యతిరాజ్ వెల్ల‌డించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా ఆదాయం వ‌చ్చింద‌ని, గ‌తేడాది అక్టోబరు 7 నుంచి 15 మధ్య 9,825 మంది దర్శించుకోగా రూ.6.6 లక్షల ఆదాయం వచ్చిందని, కొవిడ్‌ నిబంధన‌లు పాటించిన భ‌క్తుల‌ను మాత్ర‌మే కొండ‌పైకి అనుమతించామన్నారు. విజయదశమి ముగిసినా భక్తుల సంఖ్య తగ్గడం లేదని, మరో నాలుగైదురోజులు కొండపై రద్దీ ఉంటుందని, లాక్‌డౌన్‌ అనంతరం మూడు నెలల తర్వాత మైసూరుకు పర్యాటకులు భారీగా త‌ర‌లివస్తున్నార‌న్నారు. దీనిద్వారా కేఎస్ఆర్టీసికి కూడా ఆదాయం బాగా పెరిగింద‌ని, అనేక ట్రిప్పులు సంస్థ అధికారులు తిప్పుతున్నార‌ని, నాలుగురోజుల‌క‌న్నా ఎక్కువే ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: