బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఓ సారి బెయిల్ కోసం పిటిషన్ ధరకాస్తు చేసుకుంటే రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆర్యన్ ఖాన్ కు కోర్టులో చుక్కెదురైంది. గత వారం వాదనలు విన్న తరవాత తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వులో ఉంచింది. అయితే తాజాగా ఈ రోజు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తూ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇలా ఉంటే ఆయన ఖాన్ తో పాటు ప్రస్తుతం అర్బాజ్ తో సహా మరో ఆరుగురు ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం నిందితులందరికీ అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఆర్యన్ ముంబై లో సముద్రం మధ్యలో క్రూయిజ్ నౌక లో జరిగిన పార్టీ లో డ్రగ్స్ ఎంజాయ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన లో ఆర్యన్ తో పాటు పలువురు బడాబాబులు సైతం పోలీసులకు చిక్కి ప్రస్తుతం ఊసలు లెక్కబెడుతున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ మాత్రం సెలబ్రిటీ పుత్రుడు అవ్వడం వల్ల అతడే ఎక్కువగా హైలెట్ అవుతున్నాడు. ఇక ఈ కేసులో పలువురు ప్రముఖులు అప్ కమింగ్ తారలు సైతం ఉన్నారని ఎన్సిబి ధ్రువీకరించి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: