టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద కాసేపు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిన్న గాయపడిన టీడీపీ హాస్పిటల్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాగా గాయపడిన సిబ్బంది తో అంబులెన్స్ లు పార్టీ కేంద్ర కార్యాలయంకు బయలుదేరాయి. అయితే అంబులెన్స్ ను టీడీపీ ఆఫీస్ కి సమీపంలో పోలీసులు ఆపివేశారు. అయితే అంబులెన్స్ ను పార్టీ ఆఫీస్ లోపలకి అనుమతియించకపోవడంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ రోడ్డు ఎక్కారు. 

నడుచుకుంటూ వెళ్లి నారా లోకేష్ పోలీసులతో గొడవకు దిగారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రంగ ప్రవేశంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కాసేపు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే నిన్న టిడిపి కేంద్ర కార్యాలయం పై ఆటోలలో వచ్చిన కొందరు దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కార్యాలయంలో ఫర్నిచర్ ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న వారిపై దాడికి పాల్పడడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: