తెలంగాణ గురుకుల విద్యాలయాలు పునః ప్రారంభించేందు హై కోర్ట్ అనుమతులను జారీచేసింది. కరోనా సమయంలో ఇంటివద్దనుండి విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో మల్లి స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రస్తుతం స్కూల్స్ కోవిడ్ నిభందనలనుఁ పాటిస్తూ జరుపుకోబడుతున్నాయి . కానీ గురుకులాలను తెరిచేందుకు నిరాకరిస్తూ హై కోర్ట్ మధ్యంతర ఉత్తరువులు జరీ చేసినవిషయం తెలిసిందే. కానీ ఇంటర్ విద్యార్థులకు ఇది సెమిస్టరు పరీక్షల సమయం కావడం తో వారి కోసం గురుకులాలలను తెరిచేందుకు అనుమతులు ఇవ్వ వలసింది గా ప్రభుత్వ లాయర్ ట్రిబ్యునల్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ పరిస్టుల దృష్ట్యా గురుకులాలను పునః ప్రారంభించేందుకు పిటిషన్ పై అత్యవసరంగా విచారణ కోరుతూ ప్రభుత్వ లాయర్ సోమవారం విచారణ కోరగా మంగళవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా జాగర్తలు విద్య సంస్థల్లో పాటిస్తున్నట్లు అడ్వాకెట్ జనరల్ ప్రసాద్ కోర్ట్ కు విన్నవించారు. అయితే గురుకులాల్లో ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విద్య బోధనను చేపట్టాలని ధర్మాసనం సూచింది. గతం లో గురుకులాలు తెరువద్దు అని జరీ చేసిన ఆదేశాలను స్వల్ప మార్పులతో ఇప్పుడు గురుకులాలను తెరుచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: